Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!
- స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లు
- ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ
- ఓపెన్ టాప్ బస్‌లో రోడ్‌షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Players Photo With PM Modi: టీ20 ప్రపంచకప్ 2024తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లు.. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం భారత క్రికెటర్స్ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబైకి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్ బస్‌లో రోడ్‌షో ఉంటుంది. అభిమానులందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. అప్పటికే ముంబైలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రోడ్‌షో అనంతరం వాంఖడేలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Satyabhama Movie: టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!
దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ నెగ్గింది. చివరిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకోవడానికి ఏకంగా 17 ఏళ్లు పట్టింది. మొదటి ఎడిషన్ 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే భారత్ పొట్టి కప్ గెలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడడంతో భారత అభిమానుల్లో చెప్పలేని ఆనందం నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..