SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్‌లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది.
Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య?
ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ XI లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. తాజాగా అహ్మదాబాద్ లోని నెట్స్ సెషన్‌లో సంజూ శాంసన్ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి కారణం ఓపెనింగ్ లో వరుసగా మూడు సార్లు డక్ అవుట్ అయినా అభిషేక్ శర్మ స్థానంలో సంజూను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే మిడిల్ ఆర్డర్ లో ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మ స్థానాన్ని లోనైనా భర్తీ చేయవచ్చు కూడా.
మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ మార్పులు కచ్చితంగా కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, ఇంకా కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్షదీప్ సింగ్ ను తిరిగి జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. సఫారీ బ్యాటర్లను అడ్డుకోవడానికి ఈ మార్పులు అవసరమని మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ ఆశలు ఉన్నప్పటికీ.. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు కనీసం ఖాతా కూడా తెరవకపోవడం (వరుసగా సున్నాలు) ఆందోళన కలిగిస్తోంది. చిన్న జట్లపైనే తడబడిన అభిషేక్.. రబడా, నోర్ట్జే వంటి ప్రమాదకర బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. కెప్టెన్ మార్‌క్రమ్, డికాక్, స్టబ్స్, మిల్లర్ వంటి ఆటగాళ్లతో వారి బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. కేవలం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తుండటం వారి ప్రధాన బలంగా కనపడుతుంది. బౌలింగ్ లోనూ రబడా, కేశవ్ మహరాజ్ వంటి వారు భారత బ్యాటర్లను ఇబ్బందిపడడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్లేయింగ్ XI అంచనా:
భారత్:
సూర్యకుమార్ (C), అభిషేక్ / సంజూ శాంసన్ , ఇషాన్ కిషన్ (W), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, వరుణ్, బుమ్రా, అర్షదీప్.
దక్షిణాఫ్రికా:
మార్క్‌రమ్ (C), డికాక్ (W), రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, బాష్, రబడా, ఎన్‌గిడి, కేశవ్ మహరాజ్.
