India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?

  • భారత్ vs నమీబియా మ్యాచ్ ఢిల్లీలో ప్రారంభం
  • టాస్ గెలిచిన నమీబియా ముందుగా బౌలింగ్ ఎంపిక
  • అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి
  • మహ్మద్ సిరాజ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా..
India Vs Namibia

India Vs Namibia

India vs Namibia: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్‌లో నమీబియా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో ముందుగా భారత్ బ్యాటింగ్ చేయనుంది.

AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!

టాస్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాస్ ఓడినా మ్యాచ్ గెలవడం ముఖ్యం అని అన్నారు. ఈ మ్యాచ్‌లో మంచు (dew) కీలక పాత్ర పోషించవచ్చని, అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం జట్టుకు మంచి అనుభవం అవుతుందని పేర్కొన్నారు. గాయంతో బాధపడుతున్న అభిషేక్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అందుకే ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడని చెప్పారు. అలాగే మహ్మద్ సిరాజ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు.

ఇక మరోవైపు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. గత మ్యాచ్‌లో పెద్ద భాగస్వామ్యాలు లేకపోవడం లోపమని, ఈసారి మెరుగైన బ్యాటింగ్ చేయాలని ఆశిస్తున్నట్లు అన్నాడు. నమీబియా జట్టులో బెన్ షికోంగో, మాలన్ క్రుగర్లకు అవకాశం లభించగా.. లీచర్, మైబర్గ్ జట్టుకు దూరమయ్యారు.

Ragi Ambali Recipe: ఎండకాలం వచ్చేస్తుంది.. ఉపశమనం కోసం ‘రాగి అంబలి’! చేసేయండి ఇలా!

ప్లేయింగ్ XI:
భారత్:
సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

నమీబియా:
లౌరెన్ స్టీన్‌కాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్‌మన్, మాలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మ్యాక్స్ హేయింగో.