IND vs ENG: ఒకప్పటి టీమిండియా కాదు.. అరవీర భయంకరంగా ఉంది: ఇంగ్లండ్ కెప్టెన్
- సెమీస్-2 భారత్-ఇంగ్లండ్
- భారత జట్టు పూర్తిగా మారిపోయింది
- బదులివ్వడానికి మేం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler Said Team India has completely changed Now: టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరుకుంది. ఇప్పుటికే సెమీస్-2 పూర్తవగా.. మరికొద్ది గంటల్లో సెమీస్-2 జరగనుంది. ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌తోనే ఆడిన భారత్.. 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియాపై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే 2022 సెమీస్‌లో తాము ఓడించిన భారత జట్టు ఇది కాదని, ప్రస్తుత టీమిండియా అరవీర భయంకరంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. భారత జట్టు ఇప్పుడు దూకుడు మంత్రంతో ఆడుతోందని తెలిపాడు.
సెమీస్-2 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జోస్ బట్లర్ పలు విషయాలపై స్పందించాడు. ‘2022 సెమీస్‌లో ఆడిన భారత జట్టుకు, ఇప్పటి జట్టుకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మేం భిన్నమైన టీమిండియాతో ఆడనున్నాం. రోహిత్ శర్మ జట్టును నడిపించిన తీరు అద్భుతం. బ్యాటర్ల ఆడే విధానాన్ని చూస్తుంటే.. స్వేచ్ఛగా ఆడుతూ దూకుడైన ప్రదర్శన చేస్తున్నారు. 2022 టోర్నీ తర్వాత భారత జట్టు పూర్తిగా మారిపోయిందనిపిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడింది. దూకుడు మాత్రంగా భారత్ ఆడుతోంది. టీమిండియాకు బదులివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భారత్ మాదిరే దూకుడుగా మేమూ ఆడతాం’ అని బట్లర్ చెప్పాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్.. అతడితో జర జాగ్రత్త విరాట్!
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ అపజయం లేకుండా కొనసాగుతోంది. గ్రూప్, సూపర్-8 స్టేజ్‌లో వరుస విజయాలు సాధించింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఇంటికి పంపిన రోహిత్ సేన.. 2022 సెమీస్ ప్రతీకారానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. భారత్, ఇంగ్లండ్ తలపడిన గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట భారత్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..