Site icon NTV Telugu

ICC Warns Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై కోర్టుకు జియోస్టార్‌!.. రూ.315 జరిమానా..?

Icc Pak

Icc Pak

ICC Warns Pakistan: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026పై వివాదం కొనసాగుతుంది. ఈ నెల (ఫిబ్రవరి) 15న కొలంబోలో భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ను బహిష్కరించినందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB)పై న్యాయపరమైన చర్యలు తప్పవని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హెచ్చరించింది. పీసీబీకి వ్యతిరేకంగా ప్రపంచకప్‌ ప్రసారదారు జియోస్టార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఛాన్స్ ఉందని తెలిపింది. వార్షిక ఆదాయంలో వాటాగా పీసీబీకి చెల్లించాల్సిన 35 మిలియన్ డాలర్ల (రూ.315 కోట్లు)ను నిలిపివేసి, అందులోంచి జియోస్టార్ కి ఐసీసీ పరిహారం చెల్లించబోతుందని సమాచారం. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయాన్ని ఐసీసీకి ఇంకా పీసీబీ లిఖితపూర్వకంగా తెలియజేయలేదు.

Read Also: MS Dhoni: ఇట్లాంటి టీమిండియాను నేను ఇప్పటివరకు చూడలేదు.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త

అయితే, ఐసీసీ ఈవెంట్ల కోసం నాలుగేళ్ల కింద జియోస్టార్ తో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసుకున్న ఒప్పందంలో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. దాని ఆధారంగానే ఐసీసీకి ప్రసారదారు చెల్లింపులు చేసింది. కాబట్టి పీసీబీ, ఐసీసీలపై కోర్టుకెళ్లే అధికారం బ్రాడ్‌కాస్టర్లకు ఉందని ఓ పీసీబీ అధికారి కూడా చెప్పాడు. మరోవైపు, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయాన్ని పీసీబీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ అంశంపై గత వారం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరించే ముందు బోర్డు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నప్పటికీ, తీవ్రమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించకపోతే, భారీ ఆర్థిక జరిమానాలు, బ్రాడ్‌కాస్టర్ల నుంచి కేసులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ (DRC)ను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చని పీసీబీలోని ఒక వర్గం వెల్లడించింది.

Exit mobile version