2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్‌ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్‌లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా తమ స్థానాలను భద్రపరుచుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 9 జట్లు డైరెక్ట్ ఎంట్రీని ఖాయం చేసుకున్నాయి.
Vanastalipuram M*urder: రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!
Also Read
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
- INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు..
ఇక మిగిలిన మూడు స్థానాలను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. మార్చి 9వ తేదీని కట్-ఆఫ్ డేట్‌గా నిర్ణయించగా.. అప్పటిలోపు పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ర్యాంకింగ్స్ ప్రకారమే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ విషయంలో ఇది ఊరట కలిగించే అంశం. 2026 వరల్డ్ కప్‌లో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించినందుకు గానూ ఆ జట్టును ఐసీసీ టోర్నీ నుంచి తప్పించింది.
Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
అయితే, ర్యాంకింగ్స్ పరంగా మెరుగ్గా ఉండటంతో 2028 టోర్నీలో ఆ జట్టు తిరిగి భాగం కానుంది. కాగా గతేడాది భారత్‌కు వచ్చిన స్కాట్లాండ్ జట్టు ఈసారి మాత్రం రీజినల్ క్వాలిఫైయర్స్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన 8 స్థానాల కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రీజినల్ క్వాలిఫైయర్ రౌండ్లు జరగనున్నాయి. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి. ఐసీసీ తన అధికారిక ప్రకటనను మార్చి 9న వెలువరించనుంది. ప్రస్తుత వర్ల్స్ కప్ లో సూపర్ 8 ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
-
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
-
Vaibhav Suryavanshi: నెల రోజుల్లో 4సార్లు..మరో సచిన్‌లా మారుతున్న వైభవ్..ఈ లెక్కలే సాక్ష్యం !
-
Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!