Hardik Pandya: అనుకోని విషయాలు జరిగిపోయాయి.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు!
- ఫైనల్‌లో అత్యుత్తమ బౌలింగ్
- 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్
- మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya on T20 World Cup 2024 Trophy: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో టీమిండియా విజయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు క్లాసెన్, మిల్లర్ సహా రబాడలను పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హార్దిక్ భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయాడు. కన్నీటితో సహచరులను హత్తుకున్నాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మా కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేశం మొత్తం కోరుకున్న విజయాన్ని సాధించాం. ఈ విజయం నాకెంతో స్పెషల్. గత ఆరు నెలలు ఎలా గడిచాయో మీకు తెలిసిందే. అనుకోని విషయాలు జరిగిపోయాయి. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్ని వదిలి ప్రపంచకప్ కోసం సిద్దమయ్యా. కష్టపడుతూ ఉంటే మరింత మెరుగవుతామని నాకు తెలుసు. అదే నేను చేశా’ అని హార్దిక్ చెప్పాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: T20 World Cup Final: ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్ చరణ్
‘ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. జట్టు ప్రణాళికలను అమలు చేయడంలో అందరం సక్సెస్ అయ్యాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంతో విజయం సాధ్యమైంది. నాకు వారెవరో తెలియని వ్యక్తులు కూడా చాలా విషయాలు చెప్పారు. అలా అని నాకేమీ సమస్య లేదు. నేనెంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రదర్శనతో వారు సంతోషంగా ఉంటారనుకుంటా. జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. మ్యాచ్‌లో ఎప్పుడూ ఒత్తిడిగా భావించను. నైపుణ్యాలపైనే దృష్టిపెడుతా. చివరి ఐదు ఓవర్లలో మేం బాగా పుంజుకున్నాం. బుమ్రా మ్యాచ్ ఛేంజర్. నేను వందశాతం నిబద్ధతతో ప్రతి బంతిని విసిరా. ట్రోఫీ గెలిచినందుకు సంతోషం’ అని హార్దిక్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!