T20 World Cup Final: ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్ చరణ్
- దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
- మర్చిపోలేని విజయం
- మనం ఛాంపియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan and Jr NTR on India T20 World Cup Title: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాని 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు కట్టడి చేసింది. జట్టు విజయంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ కీలక పత్రాలు పోషించారు. కీలక సమయంలో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యాడు. అద్భుతంగా ఆడిన భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచకప్ 2024 ఫైనల్ విజయం అనంతరం భారత జట్టుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత జట్టు అనూహ్య విజయం సాధించింది. టీమిండియా ప్రదర్శన అమోఘం. జస్ప్రీత్ బుమ్రా అదరహో. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా పెర్ఫామెన్స్ అద్భుతం. మా కెప్టెన్ రోహిత్ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
Also Read: Rohit Sharma: మేం కాదు.. ప్రపంచకప్ అందుకోవడానికే అతనే పూర్తి అర్హుడు: రోహిత్
‘అద్భుతమైన మ్యాచ్ ఇది. ఎంతో గర్వంగా ఉంది. భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోహ్లీ ఇన్నింగ్స్, బుమ్రా బౌలింగ్, సూర్యకుమార్ క్యాచ్, రోహిత్ కెప్టెన్సీ అద్భుతం. ఇది చరిత్రాత్మక విజయం. నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో రాహుల్ ద్రవిడ్ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు మనం ఛాంపియన్స్. మనం అజేయులం, మనం భారతీయులం’ అని లోకనాయకుడు కమల్ హాసన్ పోస్ట్ చేశారు.
Incredible win for Team India! 🇮🇳 Well done, team! Hurrah for @Jaspritbumrah93 👍🏼 and outstanding performances by @imVkohli and @hardikpandya7 ! Kudos to our captain @ImRo45 and all the people behind the scenes for making this win so memorable.#TeamIndia #T20WorldCup #INDvSA…
— Ram Charan (@AlwaysRamCharan) June 29, 2024
What a Match… Soaring high with pride. Congratulations Team India! 🇮🇳
— Jr NTR (@tarak9999) June 29, 2024
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!