T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
- ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్
- కరేబియన్ దీవులకు రోహిత్ సేన
- స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill and Avesh Khan Out Form T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్ 8కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్‌లో కెనడాతో శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టేబుల్ టాపర్‌గా టీమిండియా లీగ్ దశను ముగిస్తుంది. ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్ అనంతరం కరేబియన్ దీవులకు రోహిత్ సేన పయనమవుతుంది. సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అక్కడే ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫ్లోరిడా నుంచి భారత జట్టు వెస్టిండీస్‌కు బయలుదేరనుండగా.. శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్ మాత్రం స్వదేశానికి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024లో గిల్, అవేశ్‌తో పాటు రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే.. వీరికి అవకాశం దక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. దాంతో యశస్వీ జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా బెంచ్‌కు పరిమితమవుంటున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో గిల్ సేవలు అవసరం లేదని భావించిన టీమ్ మేనేజ్మెంట్ అతన్ని స్వదేశానికి పంపించడానికి సిద్ధమైంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!
వెస్టిండీస్‌లో పిచ్‌లు స్పిన్నర్లుకు అనుకూలం. దీంతో భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో అర్షదీప్ సింగ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొహమ్మద్ సిరాజ్ బెంచ్‌కు పరిమితం అవుతాడు. హార్దిక్ కూడా కూడా ఫాస్ట్ బౌలర్‌గా ఉపయోగపడనున్నాడు. దీంతో ఓ ఫాస్ట్ బౌలర్ గాయపడినా.. అవేశ్‌తో అవసరం ఉండదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో పాటే ఉండనున్నారు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!