IND vs AFG: నేడు సూపర్-8లో భారత్ తొలి మ్యాచ్.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు
- అఫ్గానిస్తాన్‌తో భారత్ ఢీ
- రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం
- జడేజాపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన జాగ్రత్తగా ఆడాల్సిందే. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతుంది.
గ్రూప్ దశలో భారత్ విజయాలు సాధించినా విరాట్ కోహ్లీ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. 1, 4, 0 గ్రూప్ దశలో విరాట్ స్కోర్లు ఇవి. దాంతో కీలక సూపర్-8లో విరాట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ ఎలాంటి ఆరంభం అందిస్తాడన్న దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంటుంది. రిషబ్ పంత్, సూర్యకుమార్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. మిడిలార్డర్లో దూబె, హార్దిక్ కీలకం. అక్షర్ రాణిస్తున్నా.. జడేజా ఇప్పటివరకు ప్రభావం చూపలేదు. దాంతో కాబట్టి స్పెషలిస్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ను ఆడిస్తే జట్టుకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేస్ ద్వయం బుమ్రా, అర్ష్‌దీప్‌లపై భారీ అంచనాలున్నాయి. సిరాజ్ ఫామ్ అందుకంటే టీమిండియాకు ఎదురుండదు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. ముఖ్యంగా నైబ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫారూఖీ, నవీనుల్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌లు బౌలింగ్‌లో రెచ్చిపోతున్నారు. అజ్మతుల్లా, నబి, కరీమ్ లాంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. రషీద్, నబి, నూర్‌లు రెచ్చిపోతారు. కాబట్టి భారత్ జాగ్రతగా ఆడాల్సిందే.
Also Read: USA vs SA: అమెరికాపై అతి కష్టంగా గెలిచిన దక్షిణాఫ్రికా!
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా/కుల్‌దీప్, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, సిరాజ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్, అజ్మతుల్లా, నజీబుల్లా, నబి, కరీమ్ జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీనుల్, ఫారూఖీ.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!