T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
- మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్
- భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?
- ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే మొత్తంలో సుమారు 90 శాతం డబ్బు బీసీసీఐ భారత్ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నుంచే వస్తుందని రమీజ్ రాజా వెల్లడించారు. ఐసీసీ ఆదాయంలో భారత్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ ఐసీసీకి బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలే పరిస్థితి వస్తుంది’ అని రమీజ్ రాజా స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ ఆర్థికంగా ఎంతగా ఇతరులపై ఆధారపడిందో ఇట్టే అర్ధమవుతోంది. ముఖ్యంగా భారత్‌తో రాజకీయంగా గొడవలు పెట్టుకుంటూనే.. క్రికెట్ పరంగా మాత్రం భారత డబ్బులపై ఆధారపడటం ఇప్పుడు నెట్టింట చర్చనీయంశంగా మారింది.
Also Read
రమీజ్ రాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ.. బతుకేది మాత్రం ఇండియా డబ్బులపైనే’ అంటూ నెటిజన్లు పీసీబీపై సెటైర్లు విసురుతున్నారు. క్రికెట్లో రాజకీయాలు పక్కన పెట్టి.. ఆటపై దృష్టి పెట్టాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాక్ అన్ని విధాలుగా నష్టపోనుంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ మాజీలు కూడా పీసీబీపై మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!