T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్‌లు.. లిస్టులో టాప్ టీమ్స్!
- ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే
- భద్రతా, రాజకీయ పరిస్థితుల కారణంగా బహిష్కరణకు గురైన మ్యాచ్‌లు
- బహిష్కరణ లిస్టులో టాప్ టీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలు అంటే క్రీడాభిమానులకు పండగే. కానీ భద్రతా సమస్యలు, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌లు జరగకుండానే బహిష్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా.. పీసీబీ నుంచి ఐసీసీకి ఇంకా అధికారిక ప్రకటన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ టోర్నీల్లో జరిగిన బహిష్కరణ మ్యాచ్‌లపై ఓసారి లుక్కేద్దాం.
1996 వన్డే వరల్డ్‌కప్:
1996 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు భద్రతా కారణాలతో బహిష్కరణకు గురయ్యాయి. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ కూడా శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్‌ను భద్రతా సమస్యలను చూపిస్తూ బహిష్కరించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంకకు వాక్ ఓవర్ లభించింది. అప్పట్లో ఈ నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి.
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
2003 వన్డే వరల్డ్‌కప్:
2003 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్ భద్రతా, రాజకీయ కారణాలను పేర్కొంటూ బహిష్కరించింది. దాంతో ఆ మ్యాచ్‌లో జింబాబ్వేకు పాయింట్లు లభించాయి. అదే టోర్నీలో కెన్యాతో ఆడాల్సిన మ్యాచ్‌ను న్యూజిలాండ్ ఉగ్రవాద భయం కారణంగా ఆడలేదు. ఈ సంఘటనలు ఆ వరల్డ్‌కప్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
Also Read: T20 World Cup 2026: పాకిస్థాన్‌కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్‌లు ఓడితే ఇంటికే!
2026 టీ20 వరల్డ్‌కప్:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్ కూడా బహిష్కరణ దిశగా సాగుతోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. ఐసీసీ టోర్నీల చరిత్రలో మరో వివాదాస్పద ఘటనగా ఈ మ్యాచ్ నమోదు అవుతుంది. క్రికెట్లో రాజకీయాలు, భద్రతా అంశాలు జోక్యంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఐసీసీ టోర్నీల్లో ఇలాంటి బహిష్కరణలు మళ్లీ జరగకుండా క్రీడా స్ఫూర్తి నిలబడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!