SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
- సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్
- భారత అభిమానుల్లో అనేక సందేహాలు
- క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజీలాండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతను ఇషాన్ కిషన్ నిర్వర్తించాడు. సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో కీపర్ బాధ్యతలను సంజూ శాంసన్ నిర్వర్తించాడు. చివరి మ్యాచ్‌లో కిషన్‌కు అప్పగించడంపై భారత అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. సంజూ ఉన్నా కూడా కిషన్ ఎందుకు కీపింగ్ చేశాడు, ఇక సంజూ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత ఇచ్చాడు.
మ్యాచ్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ సమాధానం ఇచ్చాడు. ‘ఈరోజు మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఉన్నప్పటికీ.. ఇషాన్ కిషన్ ఎందుకు వికెట్ కీపింగ్ చేశాడు?’ అని ప్రశ్నించగా.. సిరీస్ ప్రారంభంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వివరించాడు. ‘ఈ సిరీస్ ఆరంభం నుంచి మేం ఓ ప్లాన్‌తో ముందుకెళ్లాం. సంజూ శాంసన్ మూడు మ్యాచ్‌లకు వికెట్ కీపింగ్ చేయాలి, ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్‌కు చేయాలి అనేది మా ఆలోచన. గత మ్యాచ్‌లో కిషన్ గాయంతో ఆడలేకపోయాడు. దాంతో సంజూనే వికెట్ కీపింగ్ చేశాడు. ముందుగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారం ఈ మ్యాచ్‌లో కిషన్ కీపింగ్ చేశాడు’ అని చెప్పాడు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
Also Read: Chiranjeevi: రామ్‌చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్ వివరణతో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్‌పై ఉన్న సందేహాలకు తెరపడింది. టీమిండియా మేనేజ్‌మెంట్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటోందని, వ్యక్తిగత అంశాల కంటే జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇస్తోందని సూర్య వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. దీంతో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పాత్రలపై జరుగుతున్న చర్చలకు కొంతవరకు సమాధానం లభించినట్లైంది. న్యూజీలాండ్ సిరీస్‌లోని 5 మ్యాచ్‌ల్లో సంజూ 10, 6, 0, 24, 6 స్కోర్లు చేశాడు. దాంతో ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కడం కష్టమే అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!