భారత జట్టుకు టీ20 కెప్టెన్‌ను నియమించే విషయంలో బీసీసీఐ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని దిగ్గజ భారత బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నారు, తదుపరి టీ 20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియాలో జరుగుతుందని హైలైట్ చేస్తూ… రోహిత్ శర్మ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలనీ గవాస్కర్ అన్నారు. అయితే ప్రస్తుతం అజరుగుతున ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రయాణం ముగియడంతో.. తాను ముందు చెప్పిన విధంగా టీ20 ఫార్మటు లో కెప్టెన్ గా తప్పుకున్నాడు కోహ్లీ. దాంతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ ఈ పొట్టి ఫార్మాట్ లో జట్టుకు కెప్టెన్‌గా మార్చే ఉత్తమ వ్యక్తి అని గవాస్కర్ చెప్పాడు. 5 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిళ్లను గెలుచుకున్న రోహిత్ రికార్డు, కనీసం వచ్చే ఏడాది అయినా జట్టును నడిపించడానికి అతడే ఉత్తమం అని చెబుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ప్రపంచ కప్ రెండు, మూడు ఏళ్ళు ఉంటె కొత్త వారికి ప్రయత్నించవచ్చు. కానీ మళ్ళీ టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాదిలోనే ఉంది కాబట్టి రోహిత్ నే కెప్టెన్ చేయాలి అని తెలిపాడు గవాస్కర్.