భారత జట్టు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారి లేకపోవడం కొంత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ న్యూజిలాండ్ సిరీస్ లో విహారి లేకపోవడంపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేసారు. విహారి గత కొన్ని నెలలుగా ఏ విధమైన క్రికెట్ ఆడలేదని.. అతను కనీసం ఐపీఎల్ లో కనిపించకపోవడం తో అతని పేరును పరిశీలనలోకి తీసుకోలేదు కావచ్చు అని అన్నారు. విహారి ఏ విధమైన క్రికెట్ ఆడకపోవడంతో అతనికి సరైన ప్రాక్టీస్ లేదు. అలాగే అతను చివరిగా ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ లో నాలుగు మ్యాచ్ లు ఆడాడు. అందులో కూడా ఆకట్టుకోలేక పోయాడు అందుకే అతడిని ఈ సిరీస్ కు తీసుకోలేదు కావచ్చు అని గవాస్కర్ అన్నారు. అయితే విహారిని ఈ నెలలో భారత ఏ జట్టు వెళ్తున్న సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది బీసీసీఐ.