Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Steve Smith Records Steve Smith Becomes Fastest Batters To Score 15000 International Runs

Steve Smith Record: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

Published Date :June 29, 2023 , 1:22 pm
By Sampath Kumar
Steve Smith Record: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Steve Smith completing 15000 runs in international cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 149 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.

కెరీర్‌లో 99వ టెస్టు మ్యాచ్‌ (174వ ఇన్నింగ్స్‌) ఆడుతున్న స్టీవ్ స్మిత్.. 9 వేల పరుగులు పూర్తి చేశాడు. అతి తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా 101 టెస్టు మ్యాచ్‌ల్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 9000 పరుగులు పూర్తి చేసేందుకు 172 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 111 టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేయగా.. ది వాల్ రాహుల్ ద్రవిడ్ 104 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయి అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 177 ఇన్నింగ్స్‌ల్లో 9 వేల పరుగులు పూర్తి చేశాడు.

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులను (351 ఇన్నింగ్స్‌ల్లో) కూడా స్టీవ్ స్మిత్ పూర్తి చేశాడు. అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన 7వ ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 333 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల పరుగులు పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అషిమ్ ఆమ్లా 336 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 344 ఇన్నింగ్స్‌లలో, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ 347 ఇన్నింగ్స్‌లలో, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 348 ఇన్నింగ్స్‌ల్లో, ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్ 350 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.

Steven Smith completes 15,000 runs in international cricket!

One of the legends of the game. pic.twitter.com/eIhkMFKCin

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashes 2023
  • eng vs aus
  • record
  • steve smith
  • Steve Smith Record

తాజావార్తలు

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions