Bavuma: ఓడిపోయినా ఇదే జట్టుతో నాలుగో మ్యాచ్ ఆడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ టీ20లో దక్షిణాఫ్రికా 48 పరుగుల తేడాతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా స్పందించాడు. ఒక్క ఓటమికే తమ జట్టును మార్చాలని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని బవుమా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌లలో భారత బౌలర్లను ఎదుర్కొన్న తరహాలో మూడో మ్యాచ్‌లో చేయలేకపోయిన మాట వాస్తవమని.. భారత స్పిన్నర్లు తమను కట్టడి చేశారని బవుమా అన్నాడు.
తొలి రెండు మ్యాచ్‌లలో కూడా ఆరంభంలో వికెట్లు పడ్డా మిడిలార్డర్ అద్భుతంగా ఆడిందని.. అయితే ఆ స్ట్రాటజీ మూడో మ్యాచ్‌లో రిపీట్ కాకపోవడంతోనే తమకు విశాఖ టీ20లో ఓటమి ఎదురైందని బవుమా వివరించాడు. భారత స్పిన్నర్లను ముందుగా రంగంలోకి దింపడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. తాము స్పిన్నర్లను ఆలస్యంగా రంగంలోకి దింపామన్నాడు. ఇదే రెండు జట్ల మధ్య తేడా అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లీ, బుమ్రా వంటి ఆటగాళ్లు లేకపోయినా భారత బలంగానే కనిపిస్తోందని బవుమా అన్నాడు. మూడో మ్యాచ్‌లో ఓడినా తాము ఇదే జట్టుతో నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.
Also Read
- IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
- Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
IPL Media Rights: టీవీ హక్కులు ‘స్టార్’కు.. డిజిటల్ హక్కులు ‘రిలయన్స్’కు
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..