సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంది ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో… ఓ అభిమాని ‘మీరింకా ఒంటరిగానే ఉన్నారా…? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ…. ‘అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ కలిసే ఆలోచనలు లేవు’ అని తెలిపాడు. కానీ ఈ కామెంట్‌ను అతను తర్వాత తొలగించడంతో… తన ప్రేమాయణంపై మరిన్ని అనుమానాలు సృష్టించాడు గిల్.