Shubman Gill Fined: శుభమన్ గిల్‌కు భారీ షాక్.. ఏకంగా 115 శాతం ఫైన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Fined 115 percent match fee in WTC Final 2023: టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. దాంతో మొత్తంగా గిల్‌పై 115 శాతం ఫైన్ పడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో శుభమన్ గిల్ ఔట్ అయ్యాడు. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కామెరూన్ గ్రీన్ అందుకున్నాడు. ఈ క్యాచ్ సరైనదేనని టీవీ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తన నిర్ణయాన్ని తెలిపారు. అంపైర్ నిర్ణయంపై గిల్ అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాలో కామెంట్ కూడా చేశాడు. గిల్ ప్రవర్తన సరిగా లేని కారణంగా అతనికి 15 శాతం ఫైన్ వేస్తున్నట్టు ఐసీసీ పేర్కొంది. ప్రవర్తనా నియమావళి 2.7 రూల్‌ను గిల్ అతిక్రమించినట్లు ఐసీసీ తెలిపింది. గిల్‌పై మొత్తం 115 శాతం జరిమానా పడింది.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
Also Read: World Cup 2023: ఉప్పల్ లో టీమిండియా మ్యాచ్ లు లేనట్లే..?
డబ్ల్యూటీసీ ఫైనల్లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసిన భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఫైనల్లో నెమ్మదిగా బౌలింగ్ చేసిన భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేయగా.. ఆస్ట్రేలియాకు మ్యాచ్ ఫీజులో 80 శాతం ఫైన్ వేసింది. నిర్దేశిత సమయంలో భారత్ 5 ఓవర్లు.. ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల 2.22 ప్రకారం ఒక ఓవర్ ఆలస్యమైతే.. మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేస్తారు.
Also Read: Asia Cup 2023: పంతం నెగ్గిన పాకిస్తాన్.. అందుకు ఏసీసీ పచ్చజెండా?
ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. విరాట్ కోహ్లి, అజింక్య రహనే టాప్ స్కోరర్లు. భారత్ వరుసగా రెండో ఫైనల్ ఓడిపోయింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!