కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతున్న అతడు తొలి ఇన్నింగ్సులో సెంచరీ సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అతడు 170 పరుగులు చేశాడు.
Read Also: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు
అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ధావన్ ఆస్ట్రేలియాపై తన తొలి టెస్టు ఆడగా.. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 187 పరుగులు చేశాడు. ధావన్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ తన తొలి టెస్టును వెస్టిండీస్ జట్టుపై ఆడాడు. ఆ టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 177 పరుగులు చేశాడు. కాగా కాన్పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేసిన అయ్యర్… రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు.