కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్‌ కారణంగా భయపడుతున్నాయి. దీని ప్రభావం క్రీడారంగంపైనా పడింది. ఈ నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీని అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా దేశానికి పక్కనే జింబాబ్వే ఉంటుంది. అందువల్ల కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయంతోనే మ్యాచ్‌లను వాయిదా వేసినట్లు ఐసీసీ వివరించింది.

Read Also: నవంబర్ 30 ఆఖరి తేదీ.. లేదంటే డబ్బులు జమకావు..!!

అయితే ఈ టోర్నీని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ఐసీసీ వెల్లడించలేదు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దక్షిణాఫ్రికాతో పాటు జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా వెలుగు చూసింది. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. ఆయా దేశాలు చాలా తక్కువ వ్యవధిలో విమాన సర్వీసులు రద్దు చేయడంతో తాము ప్రపంచకప్ అర్హత టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో శనివారం జరగాల్సిన శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

Related Articles

Latest Articles