India T20 Captain: సూర్యకుమార్‌కు షాక్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
- భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులు
- టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్
- అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అధికారిక ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Set to Replace Suryakumar Yadav as India T20 Captain: భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ పదవిని తెలుగు ఆతడు తిలక్ వర్మను వారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం… 2026 టీ20 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే నిర్ణయంపై బీసీసీఐ ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయి. ఈ అంశంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ గురువారం ఆన్లైన్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు పేర్కొంది.
నివేదికల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అధికారిక ఆమోదం లభించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయం గురించి సూర్యకుమార్ యాదవ్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చారట. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సూర్యకుమార్ స్థానంలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలని సూచించినట్లు సమాచారం. అయితే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదట. సెలెక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు కూడా సంజూ నిలకడైన ప్రదర్శనలు చేయలేకపోతున్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచ కప్ 2026 విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. దీర్ఘకాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు ఇంకా సమయం ఉందని పలువురు సెలెక్టర్లు భావించినట్లు సమాచారం. దీంతో శ్రేయస్ అయ్యర్ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో చోటు దక్కించుకోకపోయినా.. ఐపీఎల్లో తన నాయకత్వం, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన అయ్యర్.. ఐపీఎల్ 2026లో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోకపోయినా.. అతడు 14 మ్యాచ్‌ల్లో 498 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అంతేకాకుండా భారత టీ20 జట్టులో నాలుగో స్థానంలో కూడా శ్రేయస్ అయ్యర్‌ను ఆడించే అవకాశమున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లను ఆర్సీబీకి అందించిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారత జట్టులో చోటుపై ఎలాంటి చర్చలు జరగలేదని సమాచారం. ఈ విషయాలపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఈ విషయంపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు