Shreyas Iyer Breaks Suryakumar Yadav Record: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా అతడు 82 పరుగులు చేసి, కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆదుకున్నాడు. భారత జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని జోడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అయ్యర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి.. అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 ఇన్నింగ్స్‌లు ఆడిన అయ్యర్.. మొత్తం 1486 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డ్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. ఈ ఏడాదిలో అతడు అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 43 ఇన్నింగ్స్‌లలో 1424 పరుగులు చేశాడు. అయితే.. తాజా మ్యాచ్‌తో అయ్యర్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. సూర్య తర్వాత భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 1232 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
Wedding Video Going Viral: స్టేజ్‌పై వధువును బలవంతం చేసిన వరుడు..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఓపెనర్లతో పాటు విరాట్ కోహ్లీ కూడా పేలవ ప్రదర్శనతో పెవిలియన్‌కి చేరగా.. పుజారా (90), పంత్ (46), శ్రేయస్ అయ్యర్ (82) అద్భుతంగా రాణించి, జట్టుని ఆదుకున్నారు. పంత్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా, మెరుపు ఇన్నింగ్స్‌తో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారు.
IND vs BAN 1st Test Day 1: ముగిసిన తొలిరోజు ఆట.. అర్థశతకాలతో ఆదుకున్న పుజారా, అయ్యర్