కొన్ని పెళ్లి వేడుకల్లో చిన్న ఘటనలే రచ్చగా మారతాయి.. అవి రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు వెళ్లిపోతుంటాయి.. ఫుడ్ విషయంలో కొన్నిసార్లు, ఏర్పాట్ల విషయంలో మరికొన్ని సార్లు, వధువు-వరుల మధ్య చోటు చేసుకునే చిన్న మనస్పర్థలు ఇంకొన్నిసార్లు.. మొత్తం పెళ్లి మూడ్‌నే చెడగొట్టేస్తుంటాయి.. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.. స్టేజ్‌పై వరుడు బలవతం చేస్తే.. ప్రతిఘటించిన వధువు.. ఆ తర్వాత వరుడుపై తిరగడింది.. స్టేజ్‌పైనే పెళ్లిబట్టలు ఊడిపోయే దాక కొట్టుకున్నారు..
Read Also: Viral video: ఖాళీ పాత్రలనే ఇలా వాయిస్తున్నాడు.. ఈ బుడతడికి డ్రమ్స్ దొరికితే ఏమైనా ఉందా..?
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న పెళ్లిలో వధువు-వరుడి ఫైటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో వరుడు.. వధువుకు స్వీట్ ముక్కను తినిపించేందుకు యత్నించాడు.. అయితే, ఆమె వద్దని నిరాకరించింది. కానీ, మనోడి మొండితనమో.. ప్రేమో తెలియదు కానీ.. ఆమెను బలవంతం చేశాడు.. దీంతో, ఆగ్రహానికి గురైన ఆ పెళ్లికూతురు.. బంధువులు, స్నేహితుల సమక్షంలోనే స్టేజీపై వరుడి చెంపను చెల్లుమనిపించింది.. ఆ తర్వాత వరుడు కూడా వధువు చెంపలు వాయించాడు.. ఇక, చిలికి చిలికి గాలివానలా మారిపోయింది పరిస్థితి.. స్టేజ్‌పైనే కొట్టుకున్నారు, గిచ్చుకున్నారు, గిల్లుకున్నారు.. ఇద్దరూ ఒకరి జట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు… పెళ్లి కోసం ముస్తాబు చేయడం కామనే.. ఈ ఇద్దరి ఫైటింగ్‌లో.. పెళ్లికి చేసిన ముస్తాబు చెదిరిపోయింది.. స్టేజ్ గందరగోళంగా మారిపోయింది.. బట్టలు ఊడిపోయేదాకా కొట్టుకున్నారు.. ఇక, స్టేజ్‌పై జరుగుతోన్న ఈ ఘటనను చూసిన బంధువులు, స్నేహితులు.. వెంటనే స్టేజీపైకి పరుగెత్తారు… వారిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.. విషయం ఏంటంటే.. అసలే కోపంతో ఉన్న వధూవరులు.. ఆపేందుకు యత్నించినవారిపై కూడా దాడి చేశారు.. ఈ ఘటన సోషల్ మీడియకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది..
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022