KL Rahul vs Umpire: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మధ్య మాటల తూటాలు కొనసాగాయి. రూట్ బౌండరీ కొట్టిన తర్వాత ప్రసిద్ధ్‌ను ఎగతాళి చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, పరిస్థితి తీవ్రతరమవడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్లు అహ్సాన్ రజా, కుమార్ ధర్మసేన జోక్యం చేసుకుని ఇరువురితో మాట్లాడారు.
Read Also: Jammu: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి మేజిస్ట్రేట్, కుమారుడు మృతి
అయితే, ఈ ఘర్షణలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తన సహచరుడికి అండగా నిలిచాడు. ప్రసిద్ధ్ తరఫున ధర్మసేనను సంప్రదించి వివరణ కోరాడు. అయితే, రాహుల్ మాట్లాడిన తీరు శ్రీలంక అంపైర్ ధర్మసేనకు నచ్చలేదు.. దీంతో ఆయన రాహుల్‌ను మందలించి, మ్యాచ్ అనంతరం ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అంపైర్ మాటలకు చిర్రెత్తుకు వచ్చిన కేఎల్ రాహుల్.. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేయడం చూడటమే కాకుండా మైదానంలో ఇంకా ఏం జరుగుతుందో కూడా చూడాల్సి బాధ్యత మీపై ఉందన్నారు.
మమ్మల్ని కేవలం బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా.. మేము ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు అని అంపైర్ కుమార్ ధర్మసేనను టీమిండియా ఓపెనర్ రాహుల్ ప్రశ్నించాడు. ఇక, ఇప్పటికే ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సిరీస్‌లో ఈ సంఘటన మరింత ఉద్రిక్తతలను పెంచుతుంది.
Read Also: Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !
ఆన్-ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన- కేఎల్ రాహుల్ మధ్య సంభాషణ..
కేఎల్ రాహుల్: మరి ఏం చేయమంటావు? నిశ్శబ్దంగా ఉండు?
ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తే నీకు ఇష్టమేనా?.. నువ్వు అలా చేయలేవు రాహుల్..
కేఎల్ రాహుల్: ఇంకా ఏం చేయమంటావు? బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటావా..?
ధర్మసేన: మ్యాచ్ చివరిలో మనం చర్చిద్దాం.. నువ్వు అలా మాట్లాడకూడదు..
🔥"You want us to just bat, bowl & go home?"🔥
KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡
Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥
Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025