Shubman Gill: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను చిరకాలం నిలిచిపోయే విజయంతో ముగించింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం కాసేపు అటూ.. మరికొద్ది సేపు ఇటూ.. ఊగిసలాడినా, చివరికి టీమిండియా 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీని ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చివరి వరకు…
టీమిండియా యంగ్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంగ్లాండ్ టీమ్ ముద్దు పేరు పెట్టింది. ఈ ఆసక్తికర విషయాన్ని స్టువర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ టీమ్, ముఖ్యంగా బెన్ డకెట్, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ‘మిస్టర్ యాంగ్రీ’ అని పిలుస్తారని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఈ పేరు మైదానంలో సిరాజ్ దూకుడు వైఖరికి సంబంధించినదని అన్నాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్‌లో డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత అతను కోపంగా…
KL Rahul vs Umpire: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
James Anderson Reacts to Sharing Trophy Name with Sachin Tendulkar: ఇంగ్లీష్ గడ్డపై ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి ‘పటౌడీ సిరీస్’ అనే పేరు ఉండేది. ఇటీవలే పటౌడీ పేరును ఇంగ్లండ్ బోర్డు రిటైర్ చేసి.. ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీగా మార్చింది. భారత్‌లో తలపడితే ‘ఆంథోని డి మెల్లో’ ట్రోఫీని ఇచ్చేవారు. ఇక భారత్‌లో ఆడినా, ఇంగ్లండ్‌లో తలపడినా.. రెండు జట్ల మధ్య సిరీస్ విజేతకు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఇవ్వనున్నారు. విజేత జట్టు…
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్‌లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ చివరి, ఐదవ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్ జట్టుకు విజయంకోసం 350 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులు…
India vs England: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియంలో మొదలయింది. ఇక టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత జట్టులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కు టెస్టు అరంగేట్ర అవకాశం లభించింది. ఇటీవల ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సుదర్శన్ ఎంపికతో కొత్త శక్తిని జట్టులోకి తెచ్చినట్టయింది. ఇక చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కరుణ్ నాయర్…
Anderson–Tendulkar Trophy: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లకు ప్రతిష్టాత్మక గుర్తింపుగా “ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సంబంధించిన ట్రోఫీను తాజాగా ఆండర్సన్, టెండూల్కర్ లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడి ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్‌కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్‌కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. వీరిద్దరి సంతకాలు…