Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!
- 50 బంతుల్లో 97 పరుగులు
- మూడు పరుగుల దూరంలో శతకం
- రోహిత్ ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson React on Missing Century by 3 Runs in IND vs WI: క్రికెట్లో వ్యక్తిగత మైలురాళ్లు సాధించడం ప్రతి బ్యాటర్‌కు ప్రత్యేకమైన అనుభూతి. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలు బ్యాటర్ స్థాయిని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో మేటి దిగ్గజాలు కూడా రికార్డుల కోసం ఆడారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జట్టు విజయం ముందు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని కొందరు మాత్రమే భావిస్తుంటారు. ఆ కొందరిలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా ఒకడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 పరుగులు చేసి.. శతకాన్ని తృటిలో మిస్ అయ్యాడు.
మ్యాచ్‌లో శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికీ.. తనకు ఎలాంటి నిరాశ లేదని సంజు శాంసన్ తెలిపాడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. మీరు 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా.. ‘గత టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకాన్ని మిస్ చేసుకున్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడాలి అని రోహిత్ భాయ్ మాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. అదే భావనతోనే నేను క్రీజులోకి దిగుతాను. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడిందంటే అదే నాకు పెద్ద సంతృప్తి’ అని సంజూ చెప్పాడు.
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
Also Read: Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వ్యక్తిగత రికార్డులపై ఎక్కువ దృష్టి పెడుతున్న ఆధునిక క్రికెట్లో జట్టు విజయమే ముఖ్యం అనుకునే ఆటగాళ్లు నిజమైన టీమ్ ప్లేయర్స్ అని ఫాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. సంజు శాంసన్క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ చివరి వరకు నిలిచాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!