WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2027 Dates Announced: మహిళల క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్‌కు సంబంధించిన కీలక తేదీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. దీంతో 2027 ఆరంభంలోనే భారత క్రికెట్ మైదానాల్లో పరుగుల పండగ మొదలుకానుంది. 2027 డబ్ల్యూపీఎల్ సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు హోరాహోరీగా సాగనుంది. లీగ్ ముగిసిన వెంటనే అభిమానులను అలరించేందుకు మరొక మెగా టోర్నీ సిద్ధంగా ఉంది. నిజానికి శ్రీలంకలో జరగాల్సిన తొలి ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక భారత్‌కు మారడంతో ఆ టోర్నీని ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. అంటే డబ్ల్యూపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షురూ కానుంది. ఇలా 2027 ప్రారంభంలోనే మహిళా క్రికెటర్ల సుదీర్ఘ, బిజీ షెడ్యూల్‌తో అభిమానులకు నాన్-స్టాప్ వినోదం దక్కనుంది.
కొత్త సీజన్ సమరానికి ముందు జట్ల బలాబలాలను సరిచూసుకునే అసలైన ఘట్టం ఆటగాళ్ల వేలం. కొచ్చిలోని గ్రాండ్ హయత్ వేదికగా అక్టోబర్ 28న WPL 2027 మెగా వేలం జరగనుంది. అంతకంటే ముందే, అంటే సెప్టెంబర్ 28 నాటికే తమ జట్లలో రిటైన్ (ముందుగానే ఉంచుకునే) చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఖరారు చేయాలని ఫ్రాంచైజీలకు బార్డర్ లైన్ విధించారు. ఈ రిటైన్ ప్రక్రియ ముగిశాక, వేలంలో మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ ఐదు ఫ్రాంచైజీలు సరికొత్త వ్యూహాలతో బలమైన జట్లను రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతున్నాయి. “తమ ప్రస్తుత స్క్వాడ్‌లోని కీలక ప్లేయర్లను ఉంచుకుని, కొత్త సీజన్‌కు అవసరమైన కాంబినేషన్లను నిర్మించుకోవడానికి ఐదు ఫ్రాంచైజీలకు ఇది మంచి అవకాశం” అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
మరోవైపు ఈ మ్యాచ్‌ల వేదికలపై కూడా బీసీసీఐ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. స్పోర్ట్స్ స్టార్ నివేదికల ప్రకారం, ఈ ఐదో సీజన్ మ్యాచ్‌లకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, వడోదరలోని కొటాంబి స్టేడియంలు రేసులో ముందు వరుసలో ఉన్నాయి. విశేషమేమిటంటే, డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే జరిగే ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు కూడా ఈ రెండు మైదానాలే ఆతిథ్యమివ్వబోతున్నాయి. మొత్తానికి వేలం ఈ 2027 మహిళల క్రికెట్ సీజన్ క్రికెట్ ప్రియులకు ఖచ్చితంగా కిక్ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!