Sanju Samson: అప్పుడు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా, దేవుడు మరో అవకాశం ఇచ్చాడు.. సంజు శాంసన్ భావోద్వేగం!
- న్యూజిలాండ్ టీ20 సిరీస్ తర్వాత నిరాశలోకి వెళ్లిపోయా
- టీ20 ప్రపంచ కప్ 2026లో దేవుడు మరో అవకాశం ఇచ్చాడు
- 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 89 రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Player of the Tournament Sanju Samson Said My dream is Fulfilling: టీ20 ప్రపంచ కప్ 2026 ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత తాను పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయానని భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ వెల్లడించాడు. ఆ సమయంలో తన కలలు అన్నీ ఛిద్రమైపోయినట్టుగా అనిపించిందని చెప్పాడు. ఇక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నానని, అప్పుడే దేవుడు తనకు మరో అవకాశం ఇచ్చాడని చెప్పాడు. భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంతో తన పాత్ర ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా అని, తన కల నిజమైందని సంజు భావోద్వేగం చెందాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో గెలిచి.. టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సంజు 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 89 రన్స్ చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును సంజు శాంసన్ అందుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం సంజు మాట్లాడుతూ… ‘ఈ ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. నిజానికి ఇది ఒక కలలా అనిపిస్తుంది. చాలా, చాలా సంతోషంగా ఉంది. వరుసగా మూడు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడడంతో ఆనందంగా ఉంది. నా కల నిజమైంది. ఈ విజయానికి వెనుక చాలా కాలంగా చేసిన కష్టమే కారణం. 2024లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్ విజేత జట్టులో ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే నేను భవిష్యత్తులో ఎలా రాణించాలనే దాని గురించి కలలు కనడం మొదలుపెట్టా. ఎక్కువగా సాధన చేస్తూ, నా లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగా. దేవుని కృపతో ఇప్పుడు నా కష్టం ఫలించింది’ అని చెప్పాడు.
Also Read
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- India-Pakistan: "పాకిస్తాన్‌తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
‘న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నేను పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా. ఆ సమయంలో నా కలలు అన్నీ ఛిద్రమైపోయినట్టుగా అనిపించింది. ఇక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నా. అయితే దేవుడు నాకు మరో అవకాశం ఇచ్చాడు. కీలక మ్యాచ్‌లలో తిరిగి జట్టులోకి వచ్చి దేశం కోసం నా వంతు పాత్ర పోషించగలిగా. అప్పుడు పెద్ద కలలు కనడానికి ధైర్యం చేసినందుకు ఇప్పుడు గర్వంగా ఉంది. నా బ్యాటింగ్‌లో వచ్చిన మార్పుల కారణం మాజీ ఆటగాళ్లే. గత కొంతకాలంగా భారత మాజీ ఆటగాళ్లు నాకు మంచి సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో నేను నిరంతరం మాట్లాడుతున్నా. ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోయిన సమయంలో సరైన మైండ్‌సెట్ కోసం సచిన్‌ను సంప్రదించా. ఆయనతో చాలా సుదీర్ఘంగా మాట్లాడా’ అని సంజు తెలిపాడు.
Also Read: Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!
‘టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు ముందు రోజే కూడా సచిన్ నాకు ఫోన్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నావో అడిగారు. సచిన్ వంటి దిగ్గజం నుంచి దిశానిర్దేశం లభించడం నాకు ఎంతో గొప్ప విషయం. ఆటపై స్పష్టత, సిద్ధత, అవగాహన వంటి విషయాల్లో ఆయన సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రపంచ కప్ విజయమే నాకు చాలా పెద్ద విషయం. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. కొన్ని రోజులు గడిచిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తా’ అంటూ సంజు శాంసన్ చిరునవ్వుతో చెప్పాడు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!