Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
- జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాని సంజు శాంసన్
- సంజు శాంసన్ భవిష్యత్తుపై మరోసారి చర్చ
- సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson have great opportunity in Asian Games 2026: భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సంజును తుది జట్టు నుంచి తప్పించింది. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. దాంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక సంజు కెరీర్ క్లోజ్ అని నెటిజెన్స్ అంటున్నారు.
సూర్యవంశీకి మరోసారి భారత జట్టులో చోటు:
జూలై 23 నుంచి 26 వరకు హరారే వేదికగా జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం (జులై 6) ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వైభవ్ సూర్యవంశీకి మరోసారి భారత జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఎంపిక చేయగా.. సంజు శాంసన్‌కు మాత్రం చోటు దక్కలేదు. జింబాబ్వే పర్యటనను బీసీసీఐ సాధారణంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే వేదికగా ఉపయోగిస్తుంటుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తూ కొత్త ప్రతిభను పరీక్షించడం ఆనవాయితీ.
Also Read
- Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
- Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
సంజుకు నో ప్లేస్:
అయితే ఇదే సూత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబేలకు జింబాబ్వే సిరీస్‌లో చోటు దక్కింది. సంజు శాంసన్ మాత్రమే జట్టులో లేకపోవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే సంజు కెరీర్ ముగిసిందని భావించడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి ఇప్పటికే చోటు లభించింది. కాబట్టి అతడిపై సెలెక్టర్లు పూర్తిగా నమ్మకం కోల్పోయారనే అభిప్రాయానికి ఇప్పుడే రావడం సరైంది కాదు.
ఆసియా క్రీడల్లో సత్తా చాటితే:
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సంజు శాంసన్ వరుసగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరాడు. ఓవైపు జట్టులో తీవ్ర పోటీ ఉండగా.. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కాచుకుని కూర్చున్నా.. సంజు మాత్రం ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026 ఫామ్ కొనసాగించలేకపోయాడు. దీంతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు తొలి అవకాశం కల్పించింది. ఆసియా క్రీడల్లో అయినా సత్తా చాటితే.. సంజు మరలా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా విఫలమైతే.. ఇక కెరీర్ క్లోజ్ అయినట్లే. అయితే ఆసియా క్రీడల్లో తుది జట్టులో సంజుకు తుది జట్టులో చోటు దక్కుతుందా?, టోర్నీకి ముందు ఏమైనా మార్పులు జరుగుతాయా? అన్నది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!