Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anshul Kamboj Record: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో ఒక్క బంతిని ఎదుర్కోకుండానే.. రెండు లేదా అంతకంటే తక్కువ వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న భారత బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బుధవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కాంబోజ్ ఈ రికార్డు అందుకున్నాడు. కాంబోజ్ తన 10 ఓవర్ల కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. కాంబోజ్ బౌలింగ్ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది.
తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. టీంఇండియా 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో అన్షుల్ కాంబోజ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో అద్భుత ప్రతిభతో మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. దీంతో వన్డేల్లో ఒక్క బంతి కూడా ఆడకుండానే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న భారత ఆటగాళ్ల ప్రత్యేక జాబితాలో కాంబోజ్ చేరాడు.
Also Read
- Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
- Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
- ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
ఈ జాబితాలో అన్షుల్ కాంబోజ్ కంటే ముందు పలువురు భారత బౌలర్లు ఉన్నారు. 2023లో అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2017లో దక్షిణాఫ్రికాతో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా 2 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 2013లో జింబాబ్వేతో బులవాయోలో జరిగిన వన్డేలో మోహిత్ శర్మ 2 వికెట్లు తీసి 28 పరుగులు ఇచ్చి ఈ ఘనత సాధించాడు. అదే ఏడాది ఎడ్జ్‌బాస్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చి అవార్డును అందుకున్నాడు. అంతకుముందు 2000లో నైరోబీలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 2 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చాడు. 1995లో ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో జవగళ్ శ్రీనాథ్ 2 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చి ఈ ఘనత సాధించాడు. 1990లో లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 2 వికెట్లు తీసి 29 పరుగులు ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే:
2/22 అన్షుల్ కంబోజ్ vs న్యూజిలాండ్, ఆక్లాండ్ 2026
2/19జస్ప్రీత్ బుమ్రా vs పాకిస్తాన్, అహ్మదాబాద్ 2023
2/28 జస్ప్రీత్ బుమ్రా vs దక్షిణాఫ్రికా, ది ఓవల్ 2017
2/26 మోహిత్ శర్మ vs జింబాబ్వే, బులవాయో 2013
2/19 భువనేశ్వర్ కుమార్ vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్ 2013
2/22 అనిల్ కుంబ్లే vs కెన్యా, నైరోబి 2000
2/22 జవగళ్ శ్రీనాథ్ vs న్యూజిలాండ్, ముంబై BS 1995
2/29 అనిల్ కుంబ్లే vs ఇంగ్లండ్, లీడ్స్ 1990
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..