Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nissan Magnite, Gravite Offer: ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారతీయ వినియోగదారులకు అదిరిపోయే పండుగ ఆఫర్ ప్రకటించింది. తన పాపులర్ కార్లు మాగ్నైట్, గ్రావైట్ కొనుగోలుదారులకు ఉచితంగా CNG రెట్రోఫిట్మెంట్ కిట్లను అందిస్తోంది. ఈ కిట్ల అసలు ధర రూ.85,999 వరకు ఉండగా.. పరిమిత కాలం పాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. 2026 నవంబర్ 16వ తేదీలోపు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.
ఉచిత CNG కిట్లు
నిస్సాన్ ప్రకటించిన ఈ ఆఫర్లో భాగంగా మాగ్నైట్, గ్రావైట్ కార్లకు ప్రభుత్వం ఆమోదించిన CNG రెట్రోఫిట్మెంట్ కిట్లను ఉచితంగా పొందవచ్చు. సాధారణంగా Magnite కోసం ఈ కిట్ ధర రూ.74,999 కాగా, Gravite కోసం రూ.85,999గా ఉంది. అయితే పరిమిత కాల ఆఫర్లో భాగంగా అర్హులైన కొనుగోలుదారులకు వీటిని ఉచితంగా అందించనున్నారు. మాగ్నైట్ లో VISIA MT, VISIA EZ-SHIFT, VISIA+ MT మినహా మిగిలిన అన్ని నాన్-టర్బో వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక గ్రావైట్ లో TEKNA ట్రిమ్ కొనుగోలుదారులు మాత్రమే ఉచిత CNG కిట్ ప్రయోజనాన్ని పొందగలరు. ఈ కిట్లకు వాహనం ప్రామాణిక వారంటీతో పాటు అదనంగా 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) థర్డ్ పార్టీ వారంటీ కూడా లభిస్తుంది.
Also Read
- కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
- AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
రెండు కార్లలో CNG కిట్ సెటప్
మాగ్నైట్‌లో బూట్ స్పేస్‌లో సింగిల్ సిలిండర్‌తో కూడిన CNG కిట్‌ను అమర్చనున్నారు. మరోవైపు గ్రావైట్ లో రెండు సిలిండర్ల సెటప్‌ను అందించారు. ఇందులో 25 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సిలిండర్లు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా అమర్చడం వల్ల కారులోని మూడు వరుసల సీటింగ్ సౌకర్యం కొనసాగుతుంది. CNG కిట్లను ఉచితంగా అందించడం ద్వారా వినియోగదారులకు ఇంధన ఖర్చులు తగ్గించుకునే అవకాశం కల్పించడంతో పాటు పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని నిస్సాన్ భావిస్తోంది. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత Magnite CNG కిట్ ధర రూ.74,999, Gravite CNG కిట్ ధర రూ.85,999గా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కార్లపై CNG కిట్ మినహా ఇతర అదనపు పండుగ ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఓటింగ్‌కు దూరంగా వైసీపీ శ్రేణులు!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
ట్రెండింగ్
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!