Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Root Nears Sachin’s Test Record: టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చేరువవుతున్నాడు. ఈ నేపథ్యంలో రూట్‌పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. తన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే అతడిలో గొప్ప ఆటగాడయ్యే లక్షణాలను గుర్తించానని పేర్కొన్నారు. మంగళవారం రెడిట్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సచిన్ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును రూట్ అధిగమించే అవకాశంపై ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి సచిన్ స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడూ రూట్‌ను చాలా గొప్పగా భావించేవాడిని. అతడి తొలి టెస్టు మ్యాచ్‌లోనే అతడు గొప్ప స్థాయికి ఎదుగుతాడని నాకు అనిపించింది’ అని తెలిపాడు.
ప్రస్తుతం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. 169 టెస్టు మ్యాచ్‌ల్లో 309 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. 14,278 పరుగులు సాధించాడు. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును అధిగమించాలంటే రూట్ ఇంకా 1,643 పరుగులు చేయాల్సి ఉంది. సచిన్ తన టెస్టు కెరీర్లో 200 మ్యాచ్‌లు ఆడి 329 ఇన్నింగ్స్‌ల్లో 15,921 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుగా కొనసాగుతోంది. రూట్ 2012 డిసెంబర్లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 229 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పుడే రూట్ ప్రతిభను గుర్తించినట్లు సచిన్ తాజాగా వెల్లడించారు.
Also Read
- Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
- Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
- Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
భారత ఆటగాళ్లు కాకుండా తనకు ఇష్టమైన బ్యాటర్ల గురించి అడిగిన మరో ప్రశ్నకు సచిన్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్, జో రూట్‌తో పాటు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేర్లను చెప్పారు. వన్డే క్రికెట్ ఫార్మాట్లో మార్పులపైనా సచిన్ తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. 50 ఓవర్ల మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు రెండు విడతలుగా 25 ఓవర్ల చొప్పున విభజించాలని సూచించారు. అయితే మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలని, మ్యాచ్ అంతటా ఒకే బంతిని ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు.
‘నా సూచన చాలా సులభం. 50 ఓవర్లను రెండు ఇన్నింగ్స్‌లుగా విభజించి, ఒక్కో ఇన్నింగ్స్‌ను 25 ఓవర్లుగా నిర్వహించాలి. అయితే మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలి. మ్యాచ్ అంతటా ఒకే బంతిని ఉపయోగించాలి. దీనివల్ల బ్యాట్, బంతి మధ్య పోటీ కొనసాగుతుంది. మంచు ప్రభావం ఉండే పరిస్థితుల్లోనూ రెండు జట్లకు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ఇరు జట్లకు సమతుల్యత ఉంటుంది. బౌలర్లు కనుమరుగయ్యే పరిస్థితి రాకముందే ఏదో ఒక మార్పు చేయాలి’ అని క్రికెట్ దిగ్గజం సచిన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
-
Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!