Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగాలని ఇరాన్ పార్లమెంట్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు, పర్యవేక్షణ పూర్తిగా తొలగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతున్న ఒత్తిడి, ఆంక్షలు, బెదిరింపుల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ కుండబద్ధలు కొట్టారు. “మా అణు హక్కులను అనుభవించనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా, మా అణు కేంద్రాలపై దాడులు చేస్తున్నప్పుడు ఇలాంటి ఒప్పందాల్లో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు.
READ ALSO: Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
తమ వద్ద అణు ఆయుధాలు లేవని, భవిష్యత్తులో కూడా వాటిని తయారు చేసే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ రహస్యంగా అణు బాంబును తయారు చేస్తోందని అమెరికా చాలా కాలంగా చెప్పుకొస్తుంది. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అక్కడి నుంచి సుమారు 400 కిలోల యురేనియంను ఇరాన్ తరలించిందని, అది ఆయుధాల తయారీకి వాడే అవకాశం ఉందని అమెరికా ఆరోపించింది. పలు నివేదికల ప్రకారం.. ఇరాన్ తన విదేశీ విధానంలో సమూల మార్పులు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. NPT నుంచి బయటికి రావడం అందులో భాగం అనే చెబుతున్నారు.
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ఇప్పటికే ఇరాన్ వద్ద పెరుగుతున్న యురేనియం నిల్వలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఈరాన్ 1970 నాటి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే, పశ్చిమ ఆసియాలో అస్థిరత మరింత పెరుగుతుందని, ఇది మరిన్ని దౌత్యపరమైన ఆంక్షలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Standing Exercises: జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు బాయ్ బాయ్ చెప్పిండి..
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?