Dinesh Karthik Shocking Comments On Dhoni’s Six: ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.ఆర్సీబీ బ్యాటింగ్లో ఓపెనర్లలో కెప్టెన్ డుప్లెసిస్ (54), విరాట్ కోహ్లీ (47) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41), కెమెరాన్ గ్రీన్ (38*) ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.. ఇక ఇన్నింగ్స్ చివరిలో దినేష్ కార్తీక్ (14), మ్యాక్స్ వెల్ (16) పరుగులు చేయడంతో ఆర్సీబీ 200ప్లస్ స్కోర్ చేయగలిగింది.
Also Read; RCB Fans: అంబరాన్నంటిన ఆర్సీబీ అభిమానుల కోలాహలం.. బెంగళూరు రోడ్లన్నీ ఎరుపుమయం..
సెకండ్ ఇన్నింగ్స్ లో 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కేకి ఆరంభం లోనే క్యాప్టిన్ రుత్తురాజ్ గైక్వాడ్ వికెట్ ని కోల్పోయింది. వెంటనే వన్ డౌన్ లో వచ్చిన డేరిల్ మిచెల్ (4) రన్స్ తో వెనుదిరిగాడు .ఆ తర్వాత రచిన్ రవీంద్ర (61), అజింక్యా రహానే (33) పరుగులు చివర్లో జడేజా (42*), ధోనీ కూడా (25) పరుగులతో ఆదుకున్నప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకె పరిమితమయింది. దీంతో చెన్నైఐపీల్ 2024 ప్లే ఆప్స్ కి అనర్హత సాధించింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నెట్ రన్ రేట్ సీఎస్కే కన్నా మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది.
Also Read; Kiara Advani: వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్నకియారా అద్వానీ…
ఇక మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ “ఈ రోజు జరిగిన ఉత్తమ విషయం ఏమిటంటే,చివరి ఓవర్ లో సిఎస్కె ముందు ప్లేఆఫ్ బెర్త్ కోసం 17 పరుగులు తక్కువగా ఉండటంతో, ధోని యశ్ దయాల్ను వేసిన మొదటి బంతి ని స్టేడియం బయటకు కొట్టాడు. దానితో మాకు కొత్త బంతి వచ్చింది అప్పుడు కొత్త బాల్ తో బౌలింగ్ చేయడం చాలా మంచిది అయ్యింది అని ధోనీ కొట్టిన ఆ సిక్స్ మమల్ని ప్లే ఆఫ్స్ కి చేర్చింది ” అంటు కార్తీక్ చెప్పుకొచ్చాడు.