Royal Challengers Bangalore Scored 181 In First 20 Overs: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (55), లామ్రోర్ (54) అర్థశతకాలతో చెలరేగడం.. డు ప్లెసిస్ (45) బాగా రాణించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ డీసీ గెలుపొందాలంటే.. 182 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. మరి.. డీసీ ఛేధించగలుగుతుందా? లేక ఆర్సీబీ బౌలర్లు లక్ష్యాన్ని ఛేధించకుండా వారిని కట్టడి చేయగలుగుతారా? అనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది.
Companies: అత్యధిక ఉద్యోగులు కలిగిన టాప్-10 కంపెనీలు

ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్.. మొదట్లో నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రమంగా డు ప్లెసిస్ జోరందుకోగా.. కోహ్లీ మాత్రం స్లోగానే ఆడుతూ వచ్చాడు. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. డు ప్లెసిస్ ఒక భారీ షాట్ కొట్టబోగా, బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్ వికెట్ కీపర్‌గా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పుడు వచ్చిన లామ్రోర్.. వచ్చి రావడంతోనే మోత మోగించడం స్టార్ట్ చేశాడు. ఈ సీజన్‌లో పెద్దని రాణించని అతడు.. ఈసారి తనకు మంచి అవకాశం దక్కడంతో చెలరేగి ఆడాడు. ఎడాపెడా షాట్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవైపు కోహ్లీ సింగిల్స్, డబుల్స్ తీస్తుంటే.. మరోవైపు లామ్రోర్ పరుగుల సునామీ సృష్టించాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Harish Rao : పని చేసే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి… సద్దితిన్న రేవు తలవాలి
ఇంతలో కోహ్లీ ఔట్ అవ్వగా.. దినేశ్ కార్తిక్ రంగంలోకి దిగాడు. ఈసారి కూడా కార్తిక్ ఏమంత ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. కేవలం 11 పరుగులకే అతడు దుకాణం సర్దేశాడు. చివరి రెండు ఓవర్లను డీసీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. భారీ పరుగులు రాలేదు. లాస్ట్ రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులే వచ్చాయి. 19వ ఓవర్‌లో ముకేశ్ 6 పరుగులే ఇవ్వగా.. 20వ ఓవర్‌లో ఖలీల్ 9 పరుగులే ఇచ్చాడు. దీంతో.. ఆర్సీబీ 200 పరుగుల మార్క్‌ని అందుకోలేకపోయింది. 181 పరుగులతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.