ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. లాయల్టీ ప్రొగ్రామ్ జొమాటో గోల్డ్‌ను మళ్లీ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఇతర సదుపాయాలు పొందవచ్చు. మూడు నెలల జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్‌ను రూ. 999 నుంచి తగ్గించి లాంఛ్ ఆఫర్ కింద ఇప్పుడు రూ. 149కే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మెంబర్ షిప్ ఉన్న యూజర్లు 10కిమీల దూరం లోపు ఫుడ్ డెలివరీలను ఫ్రీగా పొందవచ్చు. దీంతోపాటు, ముందు చెప్పిన సమయానికే డెలివరీ ఇచ్చే ‘నో డిలే గ్యారెంటీ డెలివరీ’ సదుపాయం, రద్దీ సమయాల్లో వీఐపీ యాక్సెస్ తదితర సదుపాయాలు లభిస్తాయి. కాగా డైనింగ్‌పై కూడా 40శాతం వరకు డిస్కౌంట్ లభించబోతుంది.
Rohit Sharma: ‘వాస్తవాలు చూపించండి’.. బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్ అసహనం
కస్టమర్లు సులభంగా గుర్తించడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో పాత లాయల్టీ ప్రొగ్రామ్ పేరైన ‘జొమాటో గోల్డ్’ను కొనసాగిస్తున్నామే కానీ ఇది పూర్తిగా బ్రాండ్ న్యూ మెంబర్ షిప్ ప్రొగ్రామ్ అని జొమాటో సీఎఫ్ఓ అక్షంత్ గోయల్ వెల్లడించారు. జొమాటో ఎడిషన్ కార్డుతో జొమాటో ప్రో లేదా జొమాటో ప్రో ప్లస్ మెంబర్ షిప్ ఉన్నవారికి ఆ సదుపాయాలు ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతాయని, ఆ తరువాత జొమాటో గోల్డ్ మెంబర్ షిప్ ప్రారంభమవుతుందని వివరించారు. జొమాటో ప్రోను జొమాటో నిరుడు ఆగస్టులో నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, 10 నిమిషాల్లో డెలివరీ చేసే జొమాటో ఇన్‌స్టంట్ సర్వీస్‌ను జొమాటో రద్దు చేయబోతుందన్న వార్తల్ని కంపెనీ ఖండించింది. ఈ సేవల్ని రీబ్రాండింగ్ మాత్రమే చేస్తున్నామని రద్దు చేయట్లేదని స్పష్టం చేసింది. మరింత మెరుగైన ఇన్‌స్టంట్ సేవల్ని త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొంది.