ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ధర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. పంజాబ్ కాంగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ( 0 ) డక్ అవుట్ అయ్యాడు. ఇన్సింగ్స్ మూడో బంతికే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా చెత్త రికార్డును నమోదు చేశాడు.
Also Read : Jammu Kashmir Encounter: 24 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం..
రోహిత్ శర్మతో పాటు ఐపీఎల్ లో అత్యధికసార్లు డకౌటైన జాబితాలో దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, మన్ దీప్ సింగ్ లు ఉన్నారు. వీరంతా ఇప్పటి వరకు 15 సార్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకమైనది. ముంబై ఇండియన్స్ తరపున అతనికి 200వ మ్యాచ్. ఈ సీజన్ లో రోహిత్ శర్మ ఒకే ఒక్క అర్థ సెంచరీ చేశాడు. వరుసగా ఈ సీజన్ లో 1, 21, 65, 20, 28, 44, 3, 0 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమవుతున్నాడు.
Also Read : Chikoti Praveen: ఆ వార్తల వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నా తప్పేమీ లేదు
అయితే రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బ తీస్తోంది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ ( 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ లతో 77 ), జితేశ్ శర్మ ( 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 49 నాటౌట్ ) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. ముంబై బౌలర్లలో పియూస్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
Also Read : Road Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగులు విజయం సాధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్ అద్భుతమైన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్ దీప్ సింగ్, రిషీ ధావన్ తలో వికెట్ తీసుకున్నారు.