Chikoti Praveen: రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతుల వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ.. చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే! దీనిపై ప్రవీణ్ మాట్లాడుతూ తనని టార్గెట్ చేస్తున్నారని నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. కొన్ని దేశాల్లో పోకర్ టోర్నమెంట్ కి లీగల్ గా పర్మిషన్ ఉన్నాయని మండిపడ్డారు. అక్కడికి ఒక ప్లేయర్ లాగా ఈవెంట్ కి వెళ్ళానని చికోటి ప్రవీణ్ అన్నాడు. నేను రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతులు వల్లే నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నాకు లీగల్ గా వందకు పైగా స్థానాల్లో క్యాసినో నడిపే స్థలాలు ఉన్నాయన్నారు. 100 పోలీసులు పైగా ఈ రైడ్ లో పాల్గొన్నారన్నారని తెలిపారు. ఈ రైడ్ లో ఓ కమిషనర్ స్థాయి అధికారిపాల్గొన్నారని తెలిపారు. నేను తప్పించుకోవడానికి 50 లక్షలు ఇచ్చాను అనేది అవాస్తవమన్నారు.
Read also: Road Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
ఇదంతా తప్పుడు ప్రచారమన్నారు. తను ఈవెంట్ ఆర్గనియాజ్ చేయలేదన్నారు. నేను హాల్ లోకి వెళ్లిన 15 నిమిషాలకే రైడ్ జరిగిందని చికోటి ప్రవీణ్ చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ నాలుగు రోజులు లేదా మూడు రోజులని నాకు తెలియదన్నారు. 4,500 బథ్ లు థాయ్ కరెన్సీ నేను కోర్టుకి కట్టిన అని చెప్పుకొచ్చారు. నేను కట్టింది 2,00 బర్త్ థాయ్ కరెన్సీ మాత్రమే అన్నారు. నేను ఆర్గనైజేర్ కాదు, నా పేరు ఎక్కడ కూడా లేదన్నారు. నా నిర్దోషుత్వాన్ని నేను నిరూపించుకున్నానని చికోటి తెలిపారు. థాయిలాండ్ లో ఫోకర్ ఇల్లీగలని నాకు తెలియదని అన్నారు. దేవ్ , సీత నాకు ఆహ్వానం పంపడం వల్లే నేను థాయిలాండ్ కి వెళ్ళానని చికోటి చొప్పుకొచ్చారు. నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెప్పారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెప్పారని తెలిపారు. లీగల్ అని నాకు లేఖ పంపారని, అందులో స్టాంప్ లు కూడా పంపారని చికోటి తెలిపారు.
Road Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి