టీ20 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఖంగుతింది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్.. ఇంగ్లండ్ మీద 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం, అలాగే సిరీస్ (2-2) సమం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ గెలిచి ఉంటే, సిరీస్ భారత్ సొంతమై ఉండేదన్నాడు. ‘‘ప్చ్.. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సింది. అది గెలకపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే…