Travis Head: విరాట్‌తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Travis Head: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2026 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ గొడవ అనంతరం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మిన్నంటాయి. ఈ అంశంపై హెడ్ తొలిసారిగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీతో సంబంధాలు దెబ్బతిన్నాయంటూ వచ్చిన వార్తలన్నింటినీ హెడ్ కొట్టిపారేశాడు.
ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కి హ్యాండ్ షేక్ ఇవ్వలేదనేలా కొన్ని దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ ‘కోడ్ స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ మాట్లాడాడు. “మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లీతో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు” అని స్పష్టం చేశాడు.
Also Read
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
మైదానంలో జరిగే విషయాలను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తాను స్వీకరిస్తానని, కానీ సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా బాధించిందని హెడ్ వాపోయాడు. ఈ వివాదం సమయంలో తన భార్య జెస్సికా హెడ్‌కు సోషల్ మీడియాలో అనేక అభ్యంతరకర మెసేజ్‌లు వచ్చాయని తెలిపాడు. “నేను, జెస్సికా క్రీడా ప్రపంచంలో ఇవన్నీ సహజమని గ్రహించాం. కానీ ఈ ట్రోలింగ్ మా ఇతర కుటుంబ సభ్యులకు చేరినప్పుడే ఇబ్బందిగా మారింది. జెస్సికా ఈ పరిస్థితిని చాలా పరిణతితో (Maturity) ఎదుర్కొంది. కొద్దిరోజుల్లోనే ప్రజలు ఇవన్నీ మరచిపోతారు. కానీ ఆటగాళ్ల కుటుంబాలను ఆన్లైన్ నిందలకు గురిచేయడం నిజంగా దురదృష్టకరం” అని హెడ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!