Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్‌కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jhandu Kumar: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ బోణీ కొట్టింది. తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తొలి పతకం వెనుక ఉన్నది ఓ సామాన్య యువకుడి అసాధారణమైన పట్టుదల, కన్నీళ్లని తుడిచేసిన కఠోర శ్రమ! బీహార్‌లో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు, ఒకప్పటి ఈ-రిక్షా డ్రైవర్ అయిన 29 ఏళ్ల ఝండు కుమార్, గ్లాస్గోలో జరిగిన పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో చారిత్రాత్మక కాంస్య పతకాన్ని ముద్దాడి భారత్‌కు మొదటి పతకం అందించాడు. అంతకుముందు రోజు లైట్‌వెయిట్ విభాగంలో తృణమొలకలో పతకం చేజారి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత్‌కు, ఝండు కుమార్ ప్రదర్శన నిరాశను తుడిచేసి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి లిఫ్టర్లు పోటీపడిన ఈ ఈవెంట్లో ఝండు అద్భుతంగా రాణించాడు.
పారా పవర్ లిఫ్టింగ్‌లో పోటీదారుల శరీర బరువు, వారు ఎత్తే బరువును బట్టి సంక్లిష్టమైన స్కోరింగ్ పద్ధతి ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. సాధారణంగా గ్రూప్-Aలో పోటీపడే ప్లేయర్లకు శారీరక బరువు ఎక్కువ ఉండి, వ్యూహాత్మకంగా ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ గ్రూప్-B నుంచి బరిలోకి దిగిన ఝండు, ఈ సమీకరణాలన్నింటినీ తిరగరాశాడు. మొదటి నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన, తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి 130.9 పాయింట్లతో సగానికి పైగా పోటీ పూర్తయ్యేసరికి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు కంటే ఇది 8 కేజీలు తక్కువే అయినప్పటికీ, అతడి ప్రదర్శన తోటి పోటీదారులపై తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి ప్రయత్నంలో 196 కేజీల రికార్డు బరువు కోసం ప్రయత్నించి, బార్ రాక్‌కు తగలడంతో టైమింగ్ మిస్సై తృణప్రాయంలో ఆ అవకాశం కోల్పోయాడు. అయినప్పటికీ, అతడు సాధించిన 130.9 పాయింట్లే అతడికి కాంస్యాన్ని ఖాయం చేశాయి. భారత్‌కు తొలి పతకం అందించడం తనకు చాలా గర్వంగా ఉందని, త్రైవర్ణ పతాకాన్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందం వేస్తోందని ఝండు మురిసిపోయాడు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
పతకం గెలిచాక ఝండు భావోద్వేగానికి లోనవుతూ.. ఈ ఆనందాన్ని ముందుగా తన తల్లిదండ్రులకు, చిన్ననాటి నుంచి తనతో కలిసి ప్రాక్టీస్ చేసిన గౌతమ్ భయ్యాకు పంచుకుంటానని తెలిపాడు. ఈ విజయం వెనుక ఝండు పడిన కష్టం వర్ణనాతీతం. బీహార్‌లోని నలంద జిల్లా హర్నౌత్‌కు చెందిన ఝండు పుట్టుకతోనే పోలియో బాధితుడు. రోడ్డు పక్కన ఆలుగడ్డలు, ఉల్లిపాయలు అమ్మే తండ్రికి ఆసరాగా ఉంటూ, కరోనా లాక్డౌన్ సమయంలో కుటుంబాన్ని పోషించడానికి ఈ-రిక్షా నడిపాడు. 2017లో పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్, డిస్కస్ త్రోతో తన క్రీడా ప్రయాణం ప్రారంభించినా, జిమ్‌లో సాధన చేస్తున్నప్పుడు పవర్ లిఫ్టింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2023 నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లడానికి డబ్బులు లేక తన ఈ-రిక్షాను కూడా అమ్మేసుకున్నాడు. ఆ టోర్నీలో విఫలమైనప్పటికీ, అతడిలోని ప్రతిభను పారా ఒలింపిక్ కాంస్య విజేత రాజిందర్ సింగ్ రహేలూ గుర్తించి గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్లో శిక్షణ ఇచ్చారు. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడని ఝండు, 72 కేజీల విభాగంలో నేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తూ, 2025 బీజింగ్ వరల్డ్ కప్, 2026 ఆసియా అండ్ ఓషియానియా ఛాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించాడు. ఇప్పుడు కామన్వెల్త్ పతకంతో దేశం గర్వపడేలా చేసిన ఈ నలంద వీరుడు.. తదుపరి లక్ష్యం లాస్ ఏంజెల్స్ 2028 పారాలింపిక్స్ అని బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు!
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!