Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్‌లో అతడు తప్పక ఉండాల్సిందే!
- ఇంగ్లండ్, భారత్ వైట్‌బాల్ సిరీస్
- రోహిత్, కోహ్లీపై అందరి దృష్టి
- ప్రపంచకప్‌లో రోహిత్ తప్పక ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌పై దృష్టి సారించింది. ఐదు టీ20లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్.. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నిలిచింది.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ బ్యాటర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. అయితే ఇటీవల రోహిత్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రోహిత్‌కు అండగా నిలిచాడు. సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. రోహిత్ అనుభవం భారత జట్టుకు ఎంతో విలువైనదని, అతడు కేవలం గొప్ప బ్యాటర్ మాత్రమే కాకుండా అద్భుతమైన నాయకుడని కొనియాడాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
‘రోహిత్ శర్మ విషయంలో టీమ్ మేనేజ్మెంట్కు పూర్తి స్పష్టత ఉందని నేను భావిస్తున్నాను. ఆ విషయాన్ని బయటకు చెప్పకపోవచ్చు కానీ.. అతడు ప్రపంచకప్ ప్రణాళికల్లో కచ్చితంగా ఉన్నాడని నమ్ముతున్నాను. రోహిత్ అనుభవం అమూల్యమైనది. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు ధైర్యం చెప్పే నాయకుడు రోహిత్. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో అలాంటి ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు. రోహిత్ బ్యాటింగ్‌పై కూడా రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో కొన్నిసార్లు ఆకలి తగ్గినట్లు కనిపించవచ్చని, కానీ పెద్ద టోర్నీలు వచ్చినప్పుడు రోహిత్ తన అసలు స్థాయిని చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న కీలక సిరీస్‌లో కూడా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశముందని తెలిపాడు.
ఇక ఇంగ్లండ్ సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై కూడా రాయుడు స్పందించాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై రెండు సెంచరీలు సాధించినప్పటికీ అతడిని పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. తన అభిప్రాయం ప్రకారం రోహిత్, యశస్వి ఇద్దరికీ 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం ఉండాలని సూచించాడు. ‘రోహిత్ గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు, అసాధారణ నాయకుడు కూడా. అదే సమయంలో యశస్వి కూడా అవకాశానికి పూర్తిగా అర్హుడు. భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. అదే సమయంలో రోహిత్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టులో ఉంటే ప్రపంచకప్‌లో భారత్‌కు మరింత బలం చేకూరుతుంది’ అని రాయుడు స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?