Team India: ఇంగ్లండ్ బయలుదేరిన టీమిండియా.. రోహిత్ శర్మ మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది కరోనా కేసుల కారణంగా ఇంగ్లండ్‌లో టీమిండియా ఆడుతున్న టెస్టు సిరీస్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమిండియా గురువారం నాడు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.
అయితే టెస్టు జట్టు సారథి రోహిత్ శర్మ మాత్రం టీమిండియాతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. అతడు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. రోహిత్ శర్మకు ప్రస్తుతం గాయాల ఇబ్బందేమీ లేకపోయినా వ్యక్తిగత కారణంగా ఈ నెల 20న ఇంగ్లండ్ బయలుదేరనున్నాడు. విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా గురువారం నాడు ఇంగ్లండ్ వెళ్లిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ, పుజారా, జడేజా, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.
Also Read
- Ben Stokes Returns: 'క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్‌రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
England bound ✈️
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
— BCCI (@BCCI) June 16, 2022
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!