RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!
- డేవిడ్ విధ్వంసంతో 250 పరుగుల పర్వతం
- పడిక్కల్, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్
- భువనేశ్వర్ 200 వికెట్ల రికార్డు
- చెన్నైపై 43 పరుగుల భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ-సీఎస్కే పోరులో ఈసారి బెంగళూరుదే పైచేయి అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా, భారీ లక్ష్య ఛేదనలో చెన్నై తడబడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ అసలైన విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 30 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (28), ఫిల్ సాల్ట్ (46) జట్టుకు బలమైన పునాది వేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు వైపు సాగింది. చెన్నై బౌలర్లు చిన్నస్వామి పిచ్‌పై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ భారీగా పరుగులు సమర్పించుకోగా, శివం దూబే ఒక వికెట్ పడగొట్టాడు.
251 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన మొదటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7)ను అవుట్ చేయగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ ఆయుష్ మాత్రే (1)ను పెవిలియన్ పంపి ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మొదటి పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (9) కూడా నిరాశపరచడంతో చెన్నై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే క్రీజులో పాతుకుపోయిన అతడిని కృనాల్ పాండ్యా స్టంపింగ్ ద్వారా అవుట్ చేయడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి.
చివర్లో శివం దూబే (18), జేమీ ఓవర్టన్ (37), ప్రశాంత్ వీర్ (43) పోరాడినప్పటికీ అవి ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆర్సీబీ బౌలర్లు అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైని 207 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించి చెన్నై బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టింది. మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్లు చూపిన తెగివూ, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన వారికి 43 పరుగుల అద్భుత విజయాన్ని అందించింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!