భారత జట్టు నిన్న ఆడిన విధంగా అన్ని మ్యాచ్ లలో ఆడితే ఎవరు ఓడించి లేరు అని టీం ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అన్నారు. అయితే కోహ్లీ సేన నిన్న స్కాట్లాండ్ పైన భావి ఓజయం సాధించిన విషయం తెలిసిందే. దీని పై జడేజా మాట్లాడుతూ… మా నెట్ రన్-రేట్ పెరగాలంటే మేము పెద్ద తేడాతో గెలవాలని అందరికీ తెలుసు.. అందుకే మేము మైదానంలో మా 100 శాతం అందించాలని చూసాము అని జడేజా అన్నారు. ఇక మేము మా అత్యుత్తమ ఆటను ఆడాలని ప్రతి మ్యాచ్ లో అనుకుంటాము. ఇలా అన్ని మ్యాచ్ లలో ఆడితే మమల్ని ఎవరు ఓడించలేరు అది ఖాయం అని అన్నాడు. ఇక టీం ఇండియా ఈ నెల 8న నమీబియాతో ఆడనుంది. అయితే రేపు ఆఫ్ఘన్ తో జరిగే మ్యాచ్ లో కివీస్ ఓడిపోతే కోహ్లీ సేనకు సెమీస్ కు చేరుకునే అవకాశం ఉంటుంది అనేది తెలిసిందే.