Ram Charan: ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి!
- ఏపీఎల్ సీజన్-5 చివరి దశకు రంగం సిద్ధం
- నేటి నుంచి మ్యాచ్‌లు ప్రారంభం
- ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan to Attend APL 2026 Opening in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 చివరి దశకు రంగం సిద్ధమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో తొలి దశ విశాఖపట్నంలో, రెండో దశ కడపలో విజయవంతంగా నిర్వహించగా.. చివరి దశ మ్యాచ్‌లకు అమరావతి ఆతిథ్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలిచింది.
ఏపీఎల్ చరిత్రలో తొలిసారిగా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్టేడియాన్ని అత్యాధునిక సదుపాయాలతో సిద్ధం చేశారు. లీగ్ చివరి దశలో మొత్తం 12 మ్యాచ్‌లు మంగళగిరిలో జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం రెండు మ్యాచ్‌ల చొప్పున అభిమానులను అలరించనున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో చివరి దశ పోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లపై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Also Read
- Ashwin: "సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
ఏపీఎల్ ప్రారంభ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. చరణ్ రాకతో టోర్నీకి మరింత ఆకర్షణ ఏర్పడింది. ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27తో లీగ్ దశ ముగియనుండగా, జూన్ 28 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. జూన్ 30న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఏపీఎల్ సీజన్-5 ముగియనుంది. ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. క్రికెట్, వినోదం, సెలబ్రిటీ సందడి కలగలిపిన ఏపీఎల్ సీజన్-5 చివరి దశకు మంగళగిరి వేదిక కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈ స్థాయి క్రికెట్ టోర్నీ జరగడం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.
తాజావార్తలు
-
Ram Charan: ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి!
-
ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!