టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ భారత బౌలర్ షమీని నిందించారు. అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో విజయానికి బంతికో పరుగు అవసరం కాగా.. 18 ఓవర్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీచేత వేయించాడు. అయితే మంచు ఎక్కువగా కురవడం, బంతి చేతికి చిక్కకపోవడంతో షమీ వరుసగా 6, 4, 4 సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ విజయం తేలికైపోయింది. భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ మొదలైంది. షమీ పాకిస్థాన్ జట్టుకు అనుకూలంగా వ్యవహరించాడని, అతడు ఐఎస్ఐ ఏజెంట్ అని విమర్శలు చేశారు.
Read Also: మోకాలుపై కూర్చోకపోవడానికి కారణాలు చెప్పిన డికాక్
ఈ విషయంలో బీసీసీఐ, భారత క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలిచారు. జట్టుగా భారత్ ఓడిపోతే షమీ ఒక్కడినే నిందించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా తెలిసిందేంటంటే.. షమీపై ట్రోలింగ్ పాకిస్థాన్ అభిమానుల నుంచే మొదలైంది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన స్క్రీన్ షాట్లు కూడా దొరికాయి. కౌంటర్ ప్రాపగండా అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇవి బయటపడ్డాయి. కొంతమంది ఇడియట్స్ చేసిన పని ఇదని కౌంటర్ ప్రాపగండా డివిజన్ ట్వీట్ చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చాలా కీలకమైనదని.. ఉద్వేగాలు ముడిపడి ఉంటాయని తెలిసినందున మ్యాచ్ పూర్తయిన వెంటనే కావాలనే కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విమర్శలు చేశారని అందులో పేర్కొంది. షమీపై ట్రోలింగ్ చేసిన వారి ఖాతాలను పరిశీలించగా పలు ఖాతాల్లో సరైన వివరాలు లేవని.. వివరాలు ఉన్న ఖాతాల్లో చాలావరకు పాకిస్థాన్ నుంచే పోస్టులు ఉన్నాయని కౌంటర్ ప్రాపగండా తెలిపింది.