సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ మధ్య ఉన్న స్నేహం, చవువు కారణంగా వాళ్లిద్దరూ మోస్ట్ సక్సెస్ పుల్ జోడీగా నిలిచారు. ఒకరు బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడే ఫైర్ అయితే మరొకరు స్లో అండ్ స్టడీగా ప్రత్యర్థిని ముంచేసే నీటి ప్రవాహం.. సచిన్ టెండూల్కర్ తో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. కూల్ గా పాటలు పాడుతూ, భారీ సిక్సర్లు బాదడం వీరేంద్ర సెహ్వాగ్ కి బాగా అలవాటు. ఈ విషయాన్ని చాలాసార్లు స్వయంగా వెల్లడించాడు వీరూ. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో సచిన్ టెండూల్కర్ తో జరిగిన ఓ చిన్న సంఘటనను బయటపెట్టాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్నాం.. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత దెబ్బ తినకుండా ఉండేందుకు పాటలు పాడుతూ ఉంటాను.. సచిన్ టెండూల్కర్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. సచిన్ కి ఓవర్ల మధ్యలో మాట్లాడటం అలవాటు.. అది ఆయనకి స్ట్రైస్ రిలీఫ్ ని ఇస్తుంది. సచిన్ టెండూల్కర్ చాలా చెబుతున్నాడు కానీ నేనేమీ మాట్లాడకుండా వింటూ పాటలు పాడుకుంటూ ఉన్నా.. ఇలా ఓ మూడు ఓవర్లు సాగింది. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ కి కోపం వచ్చేసింది.. చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని కోపంతో తన బ్యాటుతో కొట్టాడు అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
Read Also : Ileana: సాంగ్ బాగానే ఉంది కానీ గోవా పాప షేప్ అవుట్ అయ్యిందే…
ఇలాగే పాటలు పాడుతూ పోయావంటే నిన్ను కిషోర్ కుమార్ ని చేసేస్తా అంటూ అన్నాడు. మేం బాగా ఆడుతున్నాం.. పిచ్ కూడా బాగుంది. ఇంకా మాట్లాడడానికి ఏముందంటుంది అన్నా.. సచిన్ టెండూల్కర్ మాత్రం ఇదిగో ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అన్నాడు.. ఆ మ్యాచ్ లో మేం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 140-150 పరుగులు చేశామని వీరూ అన్నాడు. ప్రతీ ఓవర్ ముగిసిన తర్వాత ఆ బౌలర్ ఎలా వేశాడు.. అతని వ్యూహాం ఏంటీ బలం ఏంటీ వంటి విషయాలు చర్చించుకునే అలవాటు సచిన్ కు ఉందన్నాడు. క్రికెట్ లో చాలా మంది ఇదే చేస్తారు.. అయితే నేను వాటిని పట్టించుకోను.. వాస్తవానికి బౌలర్ ఎలా వేస్తున్నాడు.. బౌన్స్ వస్తుందా స్పిన్ వస్తుందా వంటి విషయాలను నేను అస్సలు పట్టించికోను అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.. అవన్నీ ఆలోచిస్తే ప్రేషర్ లోకి వెళ్లిపోతాం.. ఫ్రీగా ఆడలేమని అనుకుంటా.. అందుకే ఏమీ పట్టించుకోకుండా.. నా స్టైల్ లో నేను బ్యాటింగ్ చేసుకుంటూ వెళ్లేవాటిని అంటూ సెహ్వాగ్ అన్నాడు.
Read Also : Maheshwer reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి..
2011 వన్డే వరల్డ్ కప్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకి వీరేంద్ర సెహ్వాగ్-సచిన్ టెండూల్కర్ కలిసి తొలి వికెట్ కి 142 పరుగుల భాగస్వామ్ం అందించారు. సెహ్వాగ్ 66 బంతుల్లో 12 ఫోర్లుతో 73 పరుగులు చేసి అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 101 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన గౌతమ్ గంభీర్ 69 పరుగులు చేసినా.. యువరాజ్, ధోని 12 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 1, హర్భజన్ సింగ్ 3 పరుగులే చేసినా.. యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్, అశీష్ నెహ్రా, మునాఫ్ పటేల్ డకౌట్ కావడంతో టీమిండియా 48.4 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా ఛేదించింది. 2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాకి ఎదురైన ఏకైక పరాజయం ఇది ఒక్కటే..