NZ vs IND Vizag T20: 50 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం..!
- విశాఖలో కివీస్ పరుగుల వర్షం
- సీఫెర్ట్ హాఫ్ సెంచరీతో భారత్‌పై దాడి
- దూబే మెరుపు.. కానీ భారత పతనం ఆపలేకపోయాడు
- 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ , డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సీఫెర్ట్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను మొత్తం 36 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో డారిల్ మిచెల్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో కివీస్ స్కోరు 215కు చేరింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Jaya Ekadashi 2026: జయ ఏకాదశి ఎప్పుడు? తిథి, ముహూర్తం, విశిష్టత పూర్తి వివరాలు ఇవే.!
Also Read
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆరో నంబర్‌లో వచ్చిన శివమ్ దూబే (65 పరుగులు – 23 బంతులు) తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. దూబే కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించాడు. కానీ 15వ ఓవర్‌లో మ్యాట్ హెన్రీ వేసిన బంతి బ్యాట్‌కు తగిలి బౌలర్ ఎండ్‌లోని స్టంప్స్‌ను తాకడంతో దూబే దురదృష్టవశాత్తూ ‘రన్ అవుట్’ అయ్యాడు. అక్కడితో భారత్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. దూబే అవుట్ అయిన తర్వాత భారత లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయాజాలంతో హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తీసి భారత్ పతనానికి కారణమయ్యాడు. సాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా, జాకబ్ డఫ్ఫీ చివరలో కుల్‌దీప్ యాదవ్‌ను అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను 165 పరుగుల వద్ద ముగించాడు.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!